Minister KTR : ఆకలిని తీర్చే అల్పాహారం
సీఎం కేసీఆర్ ప్రయత్నం
Minister KTR : తెలంగాణ – సీఎం కేసీఆర్ కల నెరవేరింది. రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్న నిరుపేద పిల్లలకు కడుపు నిండా అన్నంతో పాటు అల్పాహారం ఏర్పాటు చేయాలన్నది సీఎం సంకల్పం. ఇందుకు గాను కీలక నిర్ణయం తీసుకున్నారు.
Minister KTR Comment
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ప్రభుత్వ బడుల్లో అక్టోబర్ 6 శుక్రవారం పెద్ద ఎత్తున సీఎం బ్రేక్ ఫాస్ట్ (అల్పాహారం) పథకం ప్రారంభమైంది. పలు చోట్ల ఆయా జిల్లాల ఇంఛార్జ్ మంత్రులు ఈ స్కీంను ప్రారంభించారు.
హైదరాబాద్ లోని వెస్ట్ మారేడ్ పల్లిలో సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీంకు శ్రీకారం చుట్టారు సీఎం తనయుడు, ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR). దేశంలో ఎక్కడా లేని రీతిలో గురుకులాలను ఏర్పాటు చేశామన్నారు మంత్రి.
చదువుతో పాటు పిల్లల కడుపు నింపాలన్నదే తన తండ్రి లక్ష్యమన్నారు. ఇది ఎక్కడా అమలు కావడం లేదని స్పష్టం చేశారు కేటీఆర్. అంతకు ముందు ప్రభుత్వ బడిలో విద్యార్థులతో కలిసి మంత్రి టిఫిన్ చేశారు. పిల్లలకు తానే స్వయంగా తినిపించారు. విద్యార్థులను రుచి ఎలా అందంటూ అడిగి తెలుసుకున్నారు. వారంతా సంతోషం వ్యక్తం చేశారు. తమ పాలిట దేవుడు కేసీఆర్ అంటూ కొనియాడారు.
Also Read : India VS Bangladesh : బంగ్లాపై భారత్ భళా