Chandra Babu Naidu Case : బాబు బెయిల్ పై ఉత్కంఠ
రేపే కీలక తీర్పు వెలువరించనున్న హైకోర్టు
Chandra Babu Naidu Case : అమరావతి – ఏపీ స్కిల్ స్కాం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనకు ఇప్పుడు 73 ఏళ్లు. స్కిల్ స్కాంతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లోని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు , ఫైబర్ నెట్ , అంగళ్లు కేసులు నారా చంద్రబాబు నాయుడిపై కేసులు నమోదయ్యాయి.
Chandra Babu Naidu Case Viral
వీటి నుండి తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ నారా చంద్రబాబు నాయుడు తరపున న్యాయవాదులు అమరావతి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే ఏసీబీ కోర్టు ఈనెల 19 వరకు రిమాండ్ విధించింది. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడుకు ఇది కోలుకోలేని షాక్.
హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టేసింది. దీంతో బిగ్ షాక్ కు గురైన నారా చంద్రబాబు నాయుడు(Chandra Babu Naidu) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే సమయంలో ఏపీ సీఐడీ మరో షాక్ ఇచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ , అంగళ్లు లో జరిగిన ఘటనకు సంబంధించి కేసులు నమోదు చేసింది.
దీంతో చంద్రబాబు తరపు లాయర్లు హైకోర్టును ఆశ్రయించారు బెయిల్ ఇవ్వాలని. ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు తరపున సిద్దార్థ్ లూథ్రా, దూబే వాదించారు. ఈ మొత్తం కేసులకు సంబంధించి బెయిల్ ఇవ్వాలా లేదా అన్న దానిపై తుది తీర్పు అక్టోబర్ 9న సోమవారం అమరావతి హైకోర్టు వెలువరించనుంది. దీంతో టీడీపీ శ్రేణులు ఉత్కంఠకు లోనవుతున్నాయి.
Also Read : Atchannaidu : ఏపీ సర్కార్ పై అచ్చెన్న కన్నెర్ర