CM KCR : సీఎం కేసీఆర్ ఖుష్ కబర్
ములుగు జిల్లాకు వరాలు
CM KCR : హైదరాబాద్ – సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. త్వరలో తెలంగాణలో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో కోరినన్ని వరాలు ప్రకటిస్తున్నారు సీఎం. గతంలో పర్యటించిన సందర్బంగా ములుగు జిల్లా వాసులు తమకు కొత్తగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు జిల్లా వాసుల చిరకాల కోరికను మన్నించారు కేసీఆర్.
CM KCR Said Good News to Mulugu
జిల్లాలో కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రెవెన్యూ డివిజన్ గా జిల్లాలోని ఏటూరు నాగారంను ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఆదివారం కొత్తగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదిలా ఉండగా రెండు రోజుల కిందటే మల్లంపల్లి మండలం ఏర్పాటు చేసింది సర్కార్. ప్రస్తుతం రాష్ట్ర సర్కార్ ఎక్కువగా రాబోయే ఎన్నికల పైనే దృష్టి పెట్టింది. మరో పైపు భారత రాష్ట్ర సమితి బాస్ , సీఎం కేసీఆర్(CM KCR) కు అనారోగ్యానికి గురైనట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు తమను గట్టెక్కిస్తాయని అంచనా వేస్తోంది గులాబీ సర్కార్.
Also Read : Chandra Babu Naidu Case : బాబు బెయిల్ పై ఉత్కంఠ