Dasoju Sravan : పిల్లల ఆకలి తీరిస్తే తప్పా
రేవంత్ రెడ్డిపై దాసోజు ఫైర్
Dasoju Sravan : హైదరాబాద్ – బీఆర్ఎస్ అగ్ర నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ నిప్పులు చెరిగారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పేద పిల్లల కడుపు నింపేందుకు ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. తాజాగా ప్రభుత్వ బడుల్లో బ్రేక్ ఫాస్ట్ స్కీంకు శ్రీకారం చుట్టారని దీనికి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మద్దతు వస్తోందని స్పష్టం చేశారు.
Dasoju Sravan Comment
కానీ ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడు నిరాధార ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాదన్నారు. అడ్డగోలు సంపాదనకు , దోపిడీకి అలవాటు పడి కోట్లకు పడగలెత్తిన రేవంత్ కు పేదింటి పిల్లల కడుపు మంట ఎలా అర్థం అవుతుందని ప్రశ్నించారు దాసోజు శ్రవణ్(Dasoju Sravan). 50 ఏళ్ల మీ పాలనలో పిల్లల కోసం ఏం చేశారో చెప్పాలని నిలదీశారు.
ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పలహారం 23 లక్షల మంది పేద పిల్లల కడుపు నింపుతోందన్నారు. వారి ఆకలి తీర్చిన సీఎం కేసీఆర్ పై విమర్శలు చేయడం తగదన్నారు. ఒకప్పుడు బడుల పరిస్థితి దారుణంగా ఉండేదని, కానీ ఇవాళ కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా నడుస్తున్నాయని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఆలోచన వెనుక మానవీయ కోణం ఉంటుందన్నారు దాసోజు శ్రవణ్.
అల్పాహార పథకం కూడా కేవలం విద్యార్థుల కడుపు నింపే కార్యక్రమం మాత్రమే కాదు, పాఠశాలల్లో డ్రాపవుట్స్ తగ్గించి, బడి ఈడు పిల్లలందరినీ బడిబాట పట్టించి, విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పు తెచ్చే పథకమని పేర్కొన్నారు.
Also Read : Narges Mohammadi : హక్కుల కార్యకర్తకు గౌరవం