YS Sharmila Slams : మోసానికి చిరునామా కేసీఆర్ పాలన
వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల
YS Sharmila Slams : హైదరాబాద్ – వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్ చేశారు. సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. గత కొంత కాలంగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు, ధర్మాలు చేపట్టారు. ప్రత్యేకించి కేసీఆర్ పాలన అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు. తాజాగా బీఆర్ఎస్ బాస్ , సీఎం కేసీఆర్ విడుదల చేసిన పార్టీ మేనిఫెస్టోపై షర్మిల స్పందించారు.
YS Sharmila Slams KCR
కొండంత రాగం తీసి పిల్లి కూత కూసినట్లు ఉందని ఎద్దేవా చేశారు. కొత్త సీసాలో పాత నీరు చేర్చాడని , మరోసారి ఎన్నికల పేరుతో మోసం చేసేందుకు ప్లాన్ చేశాడంటూ ఆరోపించారు షర్మిల(YS Sharmila). 2018లో జరిగిన ఎన్నికలలో ఇచ్చిన హామీలకు దిక్కే లేదన్నారు. ఒక్క హామీ కూడా నెరవేర్చిన పాపాన పోలేదన్నారు.
మళ్లీ కొత్త కథ మొదలు పెట్టాడని, బతుకు మీద ధీమా ఇవ్వాల్సిన దొర పోయాక భీమా ఇస్తాడట అంటూ ఎద్దేవా చేశారు. సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానని చెప్పిన సీఎం ప్రతి మహిళకు రూ. 3 వేలు పెన్షన్ ఎలా ఇస్తాడంటూ ప్రశ్నించారు.
నిరుద్యోగ భృతి అని గత మేనిఫెస్టోలో పెట్టిన పథకానికే దిక్కు లేదన్నారు. కానీ ఇప్పుడు ఇస్తానంటే ఎలా నమ్ముతారంటూ నిలదీశారు షర్మిల. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఖాళీలు ఉంటే ఒక్క పోస్టు కూడా ఇంత వరకు నింపిన దాఖలాలు లేవన్నారు.
Also Read : Revanth Reddy : బీఆర్ఎస్ మేనిఫెస్టో వేస్ట్ పేపర్