Nimmagadda Prasad : నిమ్మగడ్డ ప్రసాద్ కు బిగ్ షాక్
ఆస్తులను జప్తు చేయాలని ఆదేశం
Nimmagadda Prasad : హైదరాబాద్ – ప్రముఖ పారిశ్రామికవేత్త నమ్మగడ్డ ప్రసాద్ కు కోలుకోలేని షాక్ తగిలింది. వ్యాపారాన్ని అడ్డం పెట్టుకుని సవాలక్ష అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. శనివారం వాణిజ్య న్యాయ స్థానంలో నిమ్మగడ్డ ప్రసాద్ కు చుక్కెదురైంది.
Nimmagadda Prasad Got Shocking News
కేసును విచారించిన కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిమ్మగడ్డ ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించింది. రాస్ అల్ ఖైమా కేసులో ఈ తీర్పు చెప్పింది. వాన్ పిక్ ప్రాజెక్టు కు సంబంధించి నిమ్మగడ్డ ప్రసాద్ వల్ల తమకు అంతులేని నష్టం వాటిల్లిందంటూ రాస్ అల్ ఖైమా ఆరోపించింది.
ఈ మేరకు వాణిజ్య కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గతంలో విచారణ చేపట్టిన కోర్టు రాస్ అల్ ఖైమాకు జరిగిన నష్టాన్ని చెల్లించాలంటూ గతంలో తీర్పు చెప్పింది. కాగా కోర్టు తీర్పును బేఖాతర్ చేశాడు నిమ్మగడ్డ ప్రసాద్(Nimmagadda Prasad). దీంతో కోర్టు సీరియస్ అయ్యింది.
మరోసారి రాస్ అల్ ఖైమా సంస్థ కోర్టును ఆశ్రయించింది. విచారించిన కోర్టు ఆస్తులను జప్తు చేయాలంటూ కోర్టు తీర్పు చెప్పింది. దీంతో నిమ్మగడ్డ ప్రసాద్ మామూలోడు కాదని తేలి పోయింది. ఆయనకు పలువురి ప్రముఖులతో సత్ సంబంధాలు ఉన్నాయి.
Also Read : Raja Singh : రాజా సింగ్ పై బీజేపీ ఫోకస్