Botsa Satyanarayana : ప‌వన్ వ‌స్తే ట్యూషన్ చెబుతా

ఏపీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ

Botsa Satyanarayana  : అమ‌రావ‌తి – ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ(Botsa Satyanarayana) నిప్పులు చెరిగారు. జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న వ‌ద్ద‌కు వ‌స్తే ట్యూష‌న్ చెప్పేందుకు సిద్దంగా ఉన్నాన‌ని అన్నారు. ఆదివారం మంత్రి మీడియాతో మాట్లాడారు.

Botsa Satyanarayana Slams Pawan Kalyan

ఎన్ని జిమ్మిక్కులు చేసినా జ‌నం న‌మ్మే స్థితిలో లేర‌న్నారు. దేశంలోనే అత్య‌ధికంగా విద్యా, వైద్య, వ్య‌వ‌సాయ రంగానికి ప్ర‌యారిటీ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఒక్క ఏపీనేన‌ని స్ప‌ష్టం చేశారు. కాక‌మ్మ క‌బుర్లు చెప్పే వాళ్ల‌ను ప్ర‌జ‌లు కోరుకోర‌ని పేర్కొన్నారు.

తాను ఏం మాట్లాడుతున్నాడో త‌న‌కే తెలియ‌ని స్థితిలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉన్నార‌ని , గ‌తి, మ‌తి, సోయి త‌ప్పి మాట్లాడుతున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముందు ఎలా మాట్లాడో నేర్చుకుంటే బెట‌ర్ అని సూచించారు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌.

త‌ను కావాల‌ని కోరుకుంటే తాను ట్యూష‌న్ చెప్పేందుకు సిద్దంగా ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశారు. ఏపీ స్కిల్ స్కాంలో అడ్డంగా బుక్కై రాజ‌మండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభ‌విస్తున్నార‌ని, ఆయ‌న‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలా మ‌ద్ద‌తు ఇస్తార‌ని ప్ర‌శ్నించారు.

Also Read : Nara Lokesh : రైతుల‌ను ప‌ట్టించుకోని జ‌గ‌న్

Leave A Reply

Your Email Id will not be published!