Ravindra Naik : ప్రవళిక సూసైడ్ కు సర్కార్ దే బాధ్యత
మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ కామెంట్స్
Ravindra Naik : హైదరాబాద్ – భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్(Ravindra Naik) షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రవళిక ఆత్మహత్య తెలుగు రాష్ట్రాలను కుదిపి వేసింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రవళిక సూసైడ్ కు ప్రధాన కారకుడు సీఎం కేసీఆర్ , ఆయన ప్రభుత్వమేనని సంచలన ఆరోపణలు చేశారు.
Ravindra Naik Comments Viral
మంత్రి కేటీఆర్ ప్రవళిక సూసైడ్ కు ప్రేమ వ్యవహారమే కారణమని పేర్కొనడం దారుణమన్నారు. ఎలాంటి సంబంధం లేని యువకుడిని ఇరికించే ప్రయత్నం చేశారంటూ ధ్వజమెత్తారు. గ్రూప్ -2 తో పాటు గ్రూప్ -1 , ఇతర పరీక్షలకు హాజరయ్యేందుకు గాను దరఖాస్తు చేసుకుందన్నారు రవీంద్ర నాయక్.
ప్రజలను మభ్య పెట్టి, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో కూలి పోవడం ఖాయమన్నారు మాజీ ఎంపీ. ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చేందుకే శివరాం రాథోడ్ ను ఇరికించిందని ఆరోపించారు. గత ఎన్నికల్లో గిరిజనులు కేసీఆర్ కు సపోర్ట్ చేశారని ఈసారి ఆ సీన్ ఉండదన్నారు.
రాష్ట్రంలో 2 లక్షల ఖాళీలు ఉంటే ఒక్క పోస్టు కూడా భర్తీ చేసిన పాపాన పోలేదన్నారు.
Also Read : KC Venu Gopal : జనం బ్రహ్మరథం కాంగ్రెస్ విజయం