Chandra Babu Letter : జైలు నుంచి బాబు లేఖ
ఓడి పోతామని అరెస్ట్ చేశారు
Chandra Babu Letter : రాజమండ్రి – ఏపీ స్కిల్ స్కాం కేసులో అడ్డంగా బుక్కై రిమాండ్ ఖైదీగా ఉన్నారు టీడీపీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఆయన గత అక్టోబర్ నెల 9న జైలు లోకి వెళ్లారు. దాదాపు 40 రోజులకు పైగా అయ్యింది. ఇప్పటి వరకు చంద్రబాబుపై ఏపీ సీఐడీ మూడు స్కాంలకు సంబంధించి కేసు నమోదు చేసింది.
Chandra Babu Letter Viral
స్కిల్ స్కాంలో రూ. 371 రూపాయలు చేతులు మారాయని, హవాలా రూపంలో బాబు అనుయాయులకు ముట్టాయని ఆరోపించింది. ఈ మేరకు సుదీర్ఘ నివేదిక కోర్టుకు అందజేసింది. దీంతో ఏపీ ఏసీబీ కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. దీనిని సవాల్ చేస్తూ హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు .
దేశంలో పేరు మోసిన లాయర్లు అంతా చంద్రబాబు తరపున వాదించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. క్వాష్ పిటిషన్ కొట్టి వేసింది కోర్టు. సుప్రీంకోర్టు కూడా అభ్యంతరం తెలిపింది. తాజాగా జైలు నుంచే నారా చంద్రబాబు నాయుడు(Chandra Babu) సుదీర్ఘ లేఖ రాశారు. తనను కావాలని అరెస్ట్ చేశారని, తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని పేర్కొన్నారు.
రాబోయే ఎన్నికల్లో ఓటమి పాలవుతామనే భయంతోనే తనను ఇరికించారని, న్యాయం, ధర్మం గెలుస్తుందని పేర్కొన్నారు. త్వరలోనే బయటకు వస్తానన్నారు.
Also Read : Eatala Rajender : కేసీఆర్ పై ఈటల పోటీ