MLA Jagga Reddy : పదేళ్లలో సీఎం అవుతా – జగ్గారెడ్డి
సంగారెడ్డి ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్
MLA Jagga Reddy : తెలంగాణ – కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గా రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ తొలి జాబితా ప్రకటించింది. ఇందులో తనకు సీటు కూడా ఖరారు చేసింది. దీంతో జగ్గారెడ్డి(Jagga Reddy) రెచ్చి పోయారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన సభలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కాక పోయినా రాబోయే 10 ఏళ్లలో కచ్చితంగా తాను తెలంగాణ రాష్ట్రానికి సీఎం అవుతానంటూ ప్రకటించారు.
MLA Jagga Reddy Said
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో సీఎం లిస్టులో జగ్గన్న కూడా చేరి పోయారు. ఇప్పటి వరకు పార్టీ పరంగా చూస్తే సీఎం పదవి రేసులో దామోదర రాజ నరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, కందూరు జానా రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి, జగ్గా రెడ్డి ఉన్నారు.
తాజాగా జగ్గన్న చేసిన కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. తనకు సీఎం పదవి అయ్యేందుకు కావాల్సిన అర్హత, అనుభవం ఉందని స్పష్టం చేశారు. తాను ఎందుకు వెనక్కి ఉండాలని ప్రశ్నించారు. గత కొంత కాలంగా ధిక్కార స్వరం వినిపిస్తూ వస్తున్నారు జగ్గారెడ్డి.
ఇప్పటికే రేవంత్ రెడ్డి తానే సీఎం అంటూ ప్రకటించారు. ఎక్కడికి వెళ్లినా అక్కడే తానే సుప్రీం అని స్పష్టం చేశారు. ఇది కూడా ఇతర నేతలలో ఆగ్రహం వ్యక్తం అయ్యేలా చేస్తోంది.
Also Read : Girija Shetkar : టికెట్ ఇస్తే సరి లేకుంటే పోటీకి రెడీ
