Komatireddy Raja Gopal Reddy : హస్తం గూటికి కోమటిరెడ్డి
త్వరలో తిరిగి కాంగ్రెస్ లోకి
Komatireddy Raja Gopal Reddy : హైదరాబాద్ – బీజేపీలో అసంతృప్త నేతలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తుండడం విస్తు పోయేలా చేసింది. గతంలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా, మునుగోడు ఎమ్మెల్యేగా పని చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నట్టుండి మనసు మార్చుకున్నట్టు సమాచారం. ఆయన ఛాలెంజ్ చేసి తన పదవికి రాజీనామా చేశారు. ఆపై బరిలో నిలిచారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు.
Komatireddy Raja Gopal Reddy May be Join in Congress
కానీ ఊహించని రీతిలో బీజేపీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రాజ గోపాల్ రెడ్డికి ప్రయారిటీ దక్కలేదు బీజేపీలో. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన కోమటిరెడ్డి(Komatireddy Raja Gopal Reddy) ఉన్నట్టుండి తిరిగి స్వంత గూటికి వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఢిల్లీలోని పార్టీ పెద్దలతో చర్చలు కూడా జరిగినట్లు టాక్.
ఇందులో భాగంగా పార్టీకి చెందిన కార్యకర్తలు, నేతలు, అనుచరులు, సర్పంచ్ లు, వార్డు సభ్యులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. తాను ఎందుకు పార్టీ మారాల్సి వస్తోందనే దానిపై క్లారిటీ ఇవ్వనున్నట్టు టాక్.
రేపో లేదా ఎల్లుండో రాహుల్ గాంధీ లేదా మరో సీనియర్ నాయకుడి సమక్షంలో మాజీ ఎమ్మెల్యే హస్తం గూటికి చేరనున్నారు. ఆ పార్టీ నుంచి కూడా లైన్ క్లియర్ రావడం విశేషం.
Also Read : Jayaprakash Narayan : జేపీ స్వరం బీఆర్ఎస్ జపం