Tejaswini Pagadala : బాబుకు ఫ్యాన్ కాంగ్రెస్ కు క్యాంపెయిన్

యువ ర‌చ‌యిత్రి తేజ‌స్విని ప‌గ‌డాల

Tejaswini Pagadala : తెలంగాణ – రోజు రోజు తెలంగాణ అస్తిత్వం మ‌స‌క బారుతున్న‌ట్లు అనిపిస్తోంది. ఒక‌వేళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గ‌నుక ప‌వ‌ర్ లోకి వ‌స్తే రేవంత్ రెడ్డి సీఎం అయినా దాని వెనుక న‌డిపించేది మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన వ్యాపార‌వేత్త‌లు, మీడియా అన్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. ఇప్ప‌టికే తాను సీఎం అయి పోయిన‌ట్లు ప్ర‌క‌టించేశారు రేవంత్ రెడ్డి.

Tejaswini Pagadala Comment

రాష్ట్రంలో అత్య‌ధిక జ‌నాభా క‌లిగి ఉన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల‌కు కాకుండా కేవ‌లం వెల‌మ‌లు, రెడ్ల సామాజిక వ‌ర్గానికి చెందిన వారు మాత్ర‌మే అత్య‌ధికంగా సీఎంలుగా కొలువు తీరారు. ఇవాళ ఎవ‌రు వ‌చ్చినా ఒరిగేది ఏమీ ఉండ‌ద‌ని తేలి పోయింది.

ప్ర‌జ‌లు మార‌నంత వ‌ర‌కు రాష్ట్రం ఇలాగే ఉంటుంది. విచిత్రం ఏమిటంటే తెలంగాణ‌లో అద్భుత‌మైన క‌ళాకారులు, ర‌చ‌యిత‌లు, మేధావులు, జ‌ర్న‌లిస్టులు ఉన్నారు. కానీ ఆంధ్ర ప్రాంతానికి చెందిన తేజ‌స్విని ప‌గ‌డాల(Tejaswini Pagadala) అనే ఆమె ఇప్పుడు తెలంగాణ ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేస్తోంది.

కాంగ్రెస్ కు ఓటు వేయాల‌ని కోరుతోంది. సో బాబు జైల్లో ఉన్నా త‌న మ‌నిషిని ఇక్క‌డ కూడా పెట్టాడ‌న్న‌మాట‌. మొత్తంగా తేజ‌స్విని ఎవ‌రిని చూస్తే చంద్ర‌బాబుకు వీరాభిమాని అని తేలి పోయింది. పాలిటిక్సా మ‌జాకా క‌దూ.

Also Read : Yerrasekhar : కాంగ్రెస్ పై ఎర్ర‌శేఖ‌ర్ గుస్సా

Leave A Reply

Your Email Id will not be published!