CM KCR : తెలంగాణ – బీఆర్ఎస్ బాస్, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. ప్రతిపక్షాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆలేరు, కోదాడ, తుంగతుర్తి నియోజకవర్గాలలో జరిగిన బీఆర్ఎస్ ఆశీర్వాద సభల్లో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి తామే అధికారంలోకి వస్తామని అన్నారు. ప్రజలు తమను ఆశీర్వదించడం ఖాయమని జోష్యం చెప్పారు.
CM KCR Comments
దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతోందని అన్నారు. ఇవాళ తెలంగాణ ఆచరిస్తుందని దానిని దేశం అనుసరించేలా చేశామని పేర్కొన్నారు కేసీఆర్(CM KCR). ఎన్నికలలో ఓటు వేసేటప్పుడు బాగా ఆలోచించి వేయాలని పిలుపునిచ్చారు.
ఎవరికి పడితే వాళ్లకు కాకుండా మంచి, చెడు, న్యాయం, అన్యాయం గురించి ఆలోచించి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏ పార్టీకి ఓటేస్తే మంచి జరుగుతది, ఏ పార్టీ రాష్ట్రాన్ని బాగు చేస్తదనే దానిని చూడాలన్నారు. లేక పోతే మీ భవిష్యత్తు అంధకారంలో పడుతుందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కరువు తాండవం చేసిందని, రైతులు బోర్లు వేసి నీళ్లు పడక, నీళ్లు పడినా కరెంటు లేక ఎన్నో గోసలు పడ్డారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. కరువులతో అల్లాడిన ఈ ప్రాంతాలు ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత అభివృద్ధి పథంలో దూసుకు పోతున్నాయని సీఎం చెప్పారు.
Also Read : Tirumala Rush : పుణ్య క్షేత్రం పోటెత్తిన భక్త జనం