Harish Rao : హైదరాబాద్ – రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న ఈ తరుణంలో మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని జోష్యం చెప్పారు ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు. బుధవారం ఎల్బీ నగర్ కు చెందిన ప్రముఖ నేత రామ్మోహన్ గౌడ్ బీఆర్ఎస్ గూటికి చేరారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.
Harish Rao Comment
నేతలు సైతం బీఆర్ఎస్ అయితేనే తమకు భవిష్యత్తు ఉంటుందని తమ పార్టీలో చేరుతున్నారని అన్నారు. మొన్నటికి మొన్న మాజీ మంత్రులు నాగం జనార్దన్ రెడ్డి, పొడపాటి చంద్రశేఖర్ , మాజీ ఎమ్మెల్యేలు ఎర్ర శేఖర్ , విష్ణు వర్దన్ రెడ్డితో పాటు పలువురు గులాబీ కండువా కప్పుకున్నారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ చెప్పే మాయ మాటలు ప్రజలు నమ్మడం లేదన్నారు హరీశ్ రావు(Harish Rao). బీజేపీ జిమ్మిక్కులు తెలంగాణలో చెల్లవని పేర్కొన్నారు. కొందరు తాము ఓడి పోతున్నామని తెలిసి దాడులకు దిగుతున్నారని , ఇలాంటి చిల్లర రాజకీయాలు మంచిది కాదని హితవు పలికారు.
ప్రజా స్వామ్యంలో ఎవరికైనా పోటీ చేసే హక్కు తప్పక ఉంటుందన్నారు. దీనిని కాదనే హక్కు ఎవరికీ లేదన్నారు. ఇది భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన అవకాశమని, దీనిని కూడా లేకుండా చేస్తే ఎలా అని ప్రశ్నించారు. తాము గెలవడం ఖాయమని, ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తామన్నారు.
Also Read : Katragadda Prasad : చంద్రబాబు ఏ తప్పు చేయలేదు