Tirumala Hundi : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.13 కోట్లు
స్వామి వారిని దర్శించుకున్న భక్తులు 63,710
Tirumala Hundi : తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవంగా భావిస్తారు తిరుమల పుణ్య క్షేత్రాన్ని భక్తులు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ చర్యలు చేపట్టింది. శ్రీనివాసుడిని 63 వేల 710 మంది దర్శించుకున్నారు.
Tirumala Hundi Updates
21 వేల 205 మంది తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.13 కోట్లు వచ్చిందని టీటీడీ(TTD) ఈవో ఏవీ ధర్మా రెడ్డి వెల్లడించారు. నడక దారి నుంచి వచ్చే భక్తులకు సంబంధించి చేతి కర్రలు అందజేస్తున్నట్లు తెలిపారు.
తిరుమలలోని 5 కంపార్ట్ మెంట్లలో స్వామి వారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. ఇక ఎలాంటి టికెట్లు లేకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు కనీసం 8 గంటలకు పైగా పట్టే అవకాశం ఉందని ఈవో ఏవీ ధర్మా రెడ్డి వెల్లడించారు.
ఇదిలా ఉండగా స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలను కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు టీటీడీ పాలకమండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఎప్పటికప్పుడు ఈవో పర్యవేక్షిస్తున్నారని, సిబ్బంది , స్వామి సేవకులు నిబద్దతతో పని చేస్తున్నారని వారి సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు చైర్మన్.
Also Read : Kaleshwaram ATM : కాళేశ్వరం ఏటీఎం హల్ చల్