G Kishan Reddy : కమీషన్ల కోసం కాళేశ్వరం
బీజేపీ చీఫ్ జి. కిషన్ రెడ్డి
G Kishan Reddy : హైదరాబాద్ – కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం కల్వకుంట్ల కుటుంబం దోచుకునేందుకే కట్టిందంటూ సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ చీఫ్ , కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి. జల శక్తి శాఖ ఆధ్వర్యంలో సమర్పించిన నివేదిక రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతోంది. మేడిగడ్డ బ్యారేజ్ కూలి పోవడానికి నాణ్యత పాటించక పోవడమేనని పేర్కొంది. మొత్తం రిపోర్ట్ లో కేసీఆర్ సర్కార్ పూర్తిగా దోషిగా తేల్చింది. దీనిపై తీవ్రంగా స్పందించారు జి. కిషన్ రెడ్డి.
G Kishan Reddy Comments on Kaleshwaram
ఆయన మీడియాతో మాట్లాడుతూ కేవలం కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారంటూ ఆరోపించారు. ఒక రకంగా ఇది అట్టర్ ప్లాప్ అయ్యిందన్నారు. తానే డిజైన్ చేశానంటూ గొప్పలు చెప్పకున్న కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదంటూ ప్రశ్నించారు. ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్లు దుర్వినియోగం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇన్ని కోట్లు ఖర్చు చేస్తే ఇంత త్వరగా పిల్లర్లు ఎలా కుంగి పోతాయంటూ ప్రశ్నించారు బీజేపీ చీఫ్. పునాదిని సరిగా నిర్మించకుండా ఎలా ముందుకు సాగుతారంటూ మండిపడ్డారు కిషన్ రెడ్డి(G Kishan Reddy). మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ లు కూలి పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
నాణ్యమైన మెటీరియల్ కూడా వాడలేదని డ్యామ్ సేఫ్టీ టీం పేర్కొందని గుర్తు చేశారు. కేంద్ర టీం అడిగిన వివరాలు సరిగా ఇవ్వలేదని ఆరోపించారు. ప్రజల సొమ్మును కేసీఆర్ దుర్వినియోగం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
Also Read : Minister Karumuri : కేసీఆర్ కామెంట్స్ కారుమూరి సీరియస్