Volgla: స్త్రీవాద ఉద్యమానికి ప్రతీక
ఓల్గా గా ప్రసిద్ధి పొందిన ప్రముఖ తెలుగు రచయిత్రి పోపూరి లలిత కుమారి
పోపూరి లలిత కుమారి (ఓల్గా)
Volgla : పోపూరి లలిత కుమారి (నవంబర్ 27, 1950): ఓల్గా గా ప్రసిద్ధి పొందిన పోపూరి లలిత కుమారి ప్రముఖ తెలుగు రచయిత్రి. గుంటూరు జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలో జన్మించిన ఓల్గా… ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ, సాహిత్యరంగపు చర్చలో స్త్రీవాద ధృక్పధాన్ని ప్రవేశపెట్టిన రచయితగా గుర్తింపు పొందారు. ‘స్వేచ్చ’ రచన ద్వారా ఆమె ప్రాచుర్యంలోకి వచ్చిన ఓల్గా స్త్రీవాద ఉద్యమానికి ప్రతీకగా నిలిచారు. విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఏ తెలుగు లిటరేచర్ చేసిన తరువాత తెనాలిలోని వి.ఎస్.ఆర్. కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగా పనిచేశారు.
Volgla : సాహిత్య జీవితం
శ్రీశ్రీ మహాప్రస్థానం, గురజాడ కన్యాశుల్కం, చలం, కొడవటిగంటి కుటుంబరావు రచనల వల్ల ప్రభావితమై పత్రికలలో, సాహిత్యములో, అనువాదములలో మహిళా హక్కులపై నినదించిన మహిళగా గుర్తింపుపొందారు. ఓల్గా(Volgla) రచించిన సహజ, స్వేచ్ఛ నవలల్లో స్వేచ్ఛ నవల అత్యంత వివాదాస్పదం మరియు ప్రజాదరణ పొందిన నవలగా పరిగణిస్తారు. ఓల్గా రచనల్లో రాజకీయ కథలు, స్వేచ్ఛ, సహజ, మానవి, కన్నీటి కెరటాల వెన్నెల, గులాబీలు, అకాశంలో సగం,
పలికించకు మౌనమృదంగాలు, జీవితం, కన్నీటి కెరటాల వెన్నెల, అక్షర యుద్ధాలు ముఖ్యమైనవి. ఓల్గా రాసిన స్వేచ్ఛ నవలని నేషనల్ బుక్ ట్రస్టు వివిధ భారతీయ భాషల్లోకి అనువదించింది. అమెరికన్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ వారు ఓల్గా వ్రాసిన 12 రచనలను, ఆమె కథల ఆంగ్లానువాదములను సేకరించి ఉంచారు. ఓల్గా రచించిన విముక్త కథలను అజయ్ వర్మా అల్లూరి కన్నడలోకి అనువదించారు. ఓల్లా రచించిన అనేక కథలు ఇతర భారతీయ భాషల్లో కూడా అనువాదమయ్యాయి.
అవార్డులు
ఓల్గా రచించిన “విముక్త” కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును ప్రధానం చేసింది. “తోడు’ అనే కథకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ కథ రచయితగా నంది అవార్డును ప్రధానం చేసింది. ఉషోదయ పబ్లికేషన్స్, ఉదయం మ్యాగజైన్ వారు ఉత్తమ నవలా రచయిత, తెలుగు విశ్వవిద్యాలయం వారు ఉత్తమ మహిళా రచయిత, లోక్ నాయక్ ఫౌండేషన్ వారు సాహితీ పురష్కారం అందజేసారు. ‘ఉషా కిరణ్’ సంస్థకు కథా రచయిత్రిగా పనిచేసి మూడు చిత్రాలు నిర్మించి పురస్కారాలు పొందారు.
Also Read : PAK vs NZ ICC World Cup : వరించిన అదృష్టం ఆశలు సజీవం