CPM List : 14 మందితో సీపీఎం తొలి జాబితా
ఎన్నికల్లో ఇక ఒంటరి పోరాటం
CPM List : హైదరాబాద్ – జాతీయ స్థాయిలో వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ ఒకే ఇండియా కూటమిలో కొనసాగుతున్నా రాష్ట్రాల వరకు వచ్చే సరికాల్లో పొత్తు పొడవడం లేదు. దీంతో ఎడ మొహం పెడ మొహంగా ఉంటూ వచ్చారు. నిన్నటి దాకా సీపీఎం, సీపీఐతో పొత్తు ఉంటుందని అంతా భావించారు. కానీ వామపక్షాలు తమకు కోరినన్ని ఇవ్వాలని, గెలిచే సీట్లు తమకు కేటాయించాలని గొంతెమ్మ కోర్కెలు కోరారు.
CPM List Released
చివరి వరకు నాన్చుతూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆఖరున వామపక్షాల ఆశలపై నీళ్లు చల్లింది. ఒకనాడు పోరాటాలకు పెట్టింది పేరైన వామపక్షాలు ఇవాళ సీట్ల కోసం ఇతర పార్టీలపై ఆధార పడాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇక ఆదివారం సీపీఎం సీనియర్ నాయకుడు తమ్మినేని వీరభద్రం(Tamineni Veerabhadram) సంచలన ప్రకటన చేశారు. ఈ సారి ఎన్నికల్లో తాము ఒంటరి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఇందులో పార్టీ పరంగా 14 మందితో తొలి జాబితాను విడుదల చేశారు. పాలేరు నుంచి తాను పోటీలో ఉంటానని ప్రకటించారు వీరభద్రం.
మిర్యాల గూడ నుంచి జూలకంటి రంగారెడ్డి, భద్రాచలం నుంచి కారం పుల్లయ్య, అశ్వారావుపేట నుంచి పిట్టల అర్జున్ , మధిర నుంచి పాలడుగు భాస్కర్ , వైరా నుంచి భూక్యా వీరభద్రం, ఖమ్మం నుంచి శ్రీకాంత్, సత్తుపల్లి నుంచి మాచర్ల భారతిని ఖరారు చేసినట్లు తెలిపారు.
ఇక నకిరేకల్ నుంచి బొజ్జ చిన వెంకులు, భువనగిరి నుంచి నరసింహ, జనగాం నుంచి కనకారెడ్డి, ఇబ్రహీంపట్నం నుంచి పడగల యాదయ్య, పటాన్ చెరు నుంచి మల్లికార్జున్ , ముషీరాబాద్ నుంచి దశరథ్ ను ఎంపిక చేసినట్లు వెల్లడించారు.
ముషీరాబాద్ నుంచి దశరథ్
Also Read : CM KCR : బరా బర్ బీఆర్ఎస్ దే సర్కార్