Katam Pradeep Kumar Goud : కాంగ్రెస్ కు షాక్ కాటం రిజైన్
టికెట్ ఇవ్వక పోవడంపై ఫైర్
Katam Pradeep Kumar Goud : హైదరాబాద్ – ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. దేవరకద్ర నియోజకవర్గంలో చివరి వరకు టికెట్ ఆశించారు ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు కాటం ప్రదీప్ కుమార్ గౌడ్(Katam Pradeep Kumar Goud). తనకు కాకుండా జి. మధుసూదన్ రెడ్డికి పార్టీ టికెట్ కేటాయించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రదీప్ వెంటనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
Katam Pradeep Kumar Goud Resign Viral
రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయ్యాక కేవలం రెడ్లకే ప్రయారిటీ ఇస్తూ వచ్చారనే ఆరోపణలు ఎక్కువయ్యాయి. ఆయన బహిరంగంగా రెడ్ల గురించే ఎక్కువగా చెప్పడం కూడా తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తోంది. ఇతర కులాల వారిని చులకనగా మాట్లాడటం కూడా ఒకింత ఎబ్బెట్టుగా మారింది.
ఈ తరుణంలో రేవంత్ రెడ్డి నిర్వాకం, ఒంటెద్దు పోకడపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్లు , కార్యకర్తలు. ఇదే సమయంలో బీసీలకు ప్రయారిటీ ఇవ్వకుండా అణిచి వేస్తున్నారంటూ బీసీ కమ్యూనిటీకి చెందిన నేతలు గుడ్ బై చెప్పారు. ఇదే ఉమ్మడి జిల్లాకు చెందిన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎర్రశేఖర్ కూడా కాంగ్రెస్ పార్టీని వీడారు. ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు.
Also Read : CM KCR : కేసీఆర్ కు తప్పిన ప్రమాదం