Revanth Reddy : దొరల తెలంగాణకు పాతర
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
Revanth Reddy : కోడంగల్ – తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పతనం ఖాయమని జోష్యం చెప్పారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రస్తుతం జరగబోయే పోరాటం ప్రజా తెలంగాణ కోసం దొరల తెలంగాణ కోసమని అన్నారు. సోమవారం కోడంగల్ నియోజకర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్బంగా భారీ ఎత్తున జనం తరలి వచ్చారు.
Revanth Reddy Comment
ఇవాళ ప్రజల ఆశీర్వాదం తన వైపు ఉందని అన్నారు. జనాన్ని ఉద్దేశించి ప్రసంగించిన రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను బురిడీ కొట్టించిన ఘనత కసీఆర్ కు దక్కుతుందన్నారు.
వ్యవస్థలను సర్వ నాశనం చేసి, అందినంత మేర దండుకున్న చరిత్ర సీఎందన్నారు రేవంత్ రెడ్డి. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణను దోపిడీ చేశాడని ఆరోపించారు. లక్షా 20 వేల కోట్లతో కట్టిన కాళేశ్వరం తెలంగాణ పాలిట శనేశ్వరంగా మారిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుస్తుందని, అందుకే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. జనం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని నిర్ణయం తీసుకున్నారని, దేవుడు దిగి వచ్చినా వారిని మార్చడం తరం కాదన్నారు.
ఇక కల్వకుంట్ల కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయమని, మిగతా ఫామ్ హౌస్ లను, ప్రగతి భవన్ ను ప్రజల పరం చేస్తామని ప్రకటించారు రేవంత్ రెడ్డి.
Also Read : Minister KTR : టూరిస్ట్ లీడర్లను జనం నమ్మరు