YS Sharmila Shock : వైఎస్ షర్మిలకు బిగ్ షాక్
పార్టీ నేతల మూకుమ్మడి రాజీనామా
YS Sharmila Shock : హైదరాబాద్ – వైఎస్సార్ తెలంగాణ ఫార్టీ చీఫ్ వైఎస్ షర్మిల కు భారీ షాక్ తగిలింది. ఎన్నికల వేళ తమను సంప్రదించకుండా ఎలా పోటీ చేయకుండా మౌనంగా ఉంటారంటూ ప్రశ్నించారు. దివంగత రాజశేఖర్ రెడ్డి మీద గౌరవంతో తాము పార్టీలో చేరామని, తీరా ఉన్నట్టుండి తమ ఆశలపై నీళ్లు చల్లారంటూ మండిపడ్డారు.
YS Sharmila Shock with her Leaders
తమను నట్టేట ముంచారంటూ వాపోయారు. కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయారంటూ సంచలన ఆరోపణలు చేశారు. షర్మిల తీరుకు నిరసనగా మూకుమ్మడిగా తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇలాంటి వారి వల్లనే పార్టీ నాశనం అవుతుందని ఆరోపించారు. తమను అడ్డం పెట్టుకుని షర్మిల దిగజారుడు రాజకీయం చేసిందటూ ధ్వజమెత్తారు. విచిత్రం ఏమిటంటే కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు షర్మిల(YS Sharmila) మద్దతును కోరలేదన్నారు. కానీ వారికి మద్దతు ఇస్తానంటూ తప్పుకోవడం దారుణంగా మోసం చేయడం తప్ప మరోటి కాదన్నారు.
ఎవరి ప్రయోజనాల కోసం తను పార్టీని తాకట్టు పెట్టిందో తెలంగాణ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read : Nara Lokesh : భయం మా బ్లడ్ లో లేదు