Gandhi Bhavan Lock : గాంధీ భవన్ గేట్లకు తాళం
టికెట్ల ఎంపికపై రేవంత్ పై ఫైర్
Gandhi Bhavan Lock : హైదరాబాద్ – తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. మొదటి నుంచి ప్రజాస్వామ్యం ఎక్కువ అని తరుచూ ప్రకటించే కాంగ్రెస్ పార్టీ(Congress) ఇప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న తీరు చూసి. మొన్నటికి మొన్న జూబ్లీ హిల్స్ టికెట్ కేటాయించక పోవడంతో విష్ణు వర్దన్ రెడ్డి అనుచరులు వీరంగం సృష్టించారు. రేవంత్ ఫ్లెక్సీని తొలగించారు.
Gandhi Bhavan Lock Viral
ఇక మూడో జాబితాలో 16 మందికి టికెట్లను కేటాయించింది. ప్రధానంగా పటాన్ చెరు టికెట్ ను గత 20 ఏళ్ల నుంచి పార్టీని నమ్ముకుని పని చేస్తున్న కాట శ్రీనివాస్ గౌడ్ ను కాదని నీలం మధు ముదిరాజ్ కు కేటాయించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గౌడ్ అనుచరులు.
భారీ ఎత్తున రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించారు. ఆ వెంటనే పలు చోట్ల ధర్నాలు, ఆందోళనలు, నిరసనలకు దిగారు. కేవలం రెడ్డి సామాజిక వర్గానికే ప్రయారిటీ ఇచ్చారని అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన బీసీలకు ఎలాంటి ప్రాతినిధ్యం లేకుండా పోయిందని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి వచ్చాక మరింత పెరిగిందని, టికెట్లను కోట్లల్లో అమ్ముకున్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో టికెట్ రాని వాళ్లంతా గాంధీ భవన్ కు తరలి రావడంతో ఎవరూ రాకుండా తాళం వేయడం విస్తు పోయేలా చేసింది.
Also Read : YS Sharmila Shock : వైఎస్ షర్మిలకు బిగ్ షాక్