MLC Kavitha Checking : ఎమ్మెల్సీ కవిత వాహనం తనిఖీ
ఏమీ లేవంటూ తేల్చేసిన అధికారులు
MLC Kavitha Checking : నిజామాబాద్ – తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఆయా పార్టీలకు చెందిన నేతలు, స్టార్ క్యాంపెయినర్లు విస్తృతంగా పర్యటిస్తున్నారు. జోరుగా ప్రచారం చేస్తున్నారు. మాటల తూటాలు పేల్చుతున్నారు. ఇదిలా ఉండగా ఎక్కడికి వెళ్లినా ఎన్నికల కమిషన్ అధికారులు, పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.
MLC Kavitha Checking Vehicles from EC
మంగళవారం నిజామాబాద్ జిల్లాలో భారత రాష్ట్ర సమితి పార్టీ తరపున ప్రచారం చేస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) వాహనాలను తనిఖీ చేశారు. తనిఖీల సందర్బంగా కవిత వారికి సహకరించారు. మొత్తంగా చూసిన అధికారులకు ఎలాంటి డబ్బులు కనిపించలేదు. దీంతో వారు విస్తు పోయారు. ఎంతైనా సీఎం కూతురు కొంతలో కొంతైనా దొరుకుతుందని అనుకున్నారు.
ఇదిలా ఉండగా మరోసారి తామే అధికారంలోకి వస్తామని ప్రకటించారు. తమకు ఎదురే లేదని చాటారు కవిత. తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలు ఓడి పోవడం ఖాయమని జోష్యం చెప్పారు. ముచ్చటగా తన తండ్రి కేసీఆర్ మూడోసారి సీఎం అవుతారని ప్రకటించారు. కాగా కవిత ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కాంలో పాత్ర ఉందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదంతా కేంద్రం చేస్తున్న నాటకం అంటూ కొట్టి పారేశారు.
Also Read : Yaddanapudi Sulochana Rani: నవలా రాజ్యంలో రాణి