Kodavatiganti Kutumbarao: కొకు రచనలతో ప్రశిద్ధి చెందిన కొడవటిగంటి
కొకుగా చిరపరిచితుడైన కొడవటిగంటి కుటుంబరావు సుప్రసిద్ధ తెలుగు రచయిత
కొడవటిగంటి కుటుంబరావు
Kodavatiganti Kutumbarao : కొడవటిగంటి కుటుంబరావు (1909 అక్టోబర్ 28 – 1980 ఆగష్టు 17): కొకు గా చిరపరిచితుడైన కొడవటిగంటి కుటుంబరావు సుప్రసిద్ధ తెలుగు రచయిత హేతువాది. చందమామ పత్రికను చందమామగా తీర్చిదిద్దిన ప్రముఖుల కొడవటిగంటి ముఖ్యులు. గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించిన కొడవటిగంటి కుటుంబరావు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కొల్పోయి మేనమామ సంరక్షణలో పెరిగాడు. తన యాభై ఏళ్ళ రచనా జీవితంలో పది పన్నెండు వేల పేజీలకు మించిన రచనలు చేసాడు. సమకాలీన మానవ జీవితాన్ని పరామర్శించి, విమర్శించి, సుసంపన్నం చేసేదే సరైన సాహిత్యంగా కొడవటిగంటి భావించాడు.
Kodavatiganti Kutumbarao – కొడవటిగంటి రచనా ప్రస్థానం
13 ఏళ్ళకే సస్పెన్స్ థ్రిల్లర్ నవలన వ్రాయడం ప్రారంభిన కొడవటిగంటి కుటుంబరావు(Kodavatiganti Kutumbarao) తన యాభై ఏళ్ళ రచనా జీవితంలో 12 వేలకు పైగా రచనలు చేసారు. కొకు రచనలుగా ప్రశిద్ధి చెందిన వాటిలో అనేక నవలలు, చిన్న కథలు, దిబ్బ కథలు, శాస్త్రవిజ్ఞాన కల్పనా కథలు, హపూర్వ హపరాధ పరిశోధక కథలు, హాస్య, వ్యంగ్య కథలు, గల్పికలు, నాటికలు, వాస్తవిక రచనలు, అనువాదాలు ఉన్నాయి. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని శాస్త్రీయ దృక్పథంతో విప్లవాత్మకంగా మార్చిన గొప్ప సాంస్కృతిక శక్తిగా కోకు గుర్తింపుపొందారు. అభ్యుదయ సాహిత్య ఉద్యమాలలో ఎప్పుడూ ముందుండే ఆయన కాలంతో పాటు ఎదుగుతూ వచ్చారు. దీనిలో భాగంగా నవ్య సాహిత్య పరిషత్, ఫోరమ్ ఫర్ మోడరన్ లిటరేచర్ సభ్యుడుగా… తర్వాత మార్క్సిజం ప్రభావంతో 1940లో అభ్యుదయ రచయితల సంఘంలో చేరారు. దాని పనితీరు పట్ల అసంతృప్తితో, అతను 1970లో విప్లవ రచయితల సంఘంలో చేరి తన చివరి వరకు దాని ఉపాధ్యక్షుడిగా కొనసాగారు. అతని విశ్లేషణ మరియు తార్కికం ఆలోచనను రేకెత్తించడమే కాకుండా క్రూరమైన, అజ్ఞాన, దిగజారుడు మరియు మూఢనమ్మకాలపై పోరాడాలని విజ్ఞప్తి చేసింది.
బుద్ధి కొలతవాదంను ప్రతిపాదించిన కొడవటిగంటి
జగత్తులో స్థలము (space), కాలము (time) అనే రెండు కొలతలు ఉన్నట్టు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. జగత్తుకు ఈ రెండు కొలతలే కాకుండా బుద్ధి అనేది కొలతగా పనిచేస్తుంది అనే సిద్ధాంతాన్ని బుద్ధికొలత వాదం అనే పేరుతో కొడవటిగంటి కుటుంబరావు మొట్టమొదటిసారిగా ప్రతిపాదించాడు. కొడవటిగంటి ప్రతిపాదించిన బుద్ధి కొలతవాదం అనేక చర్చలకు దారితీసింది.
Also Read : Yaddanapudi Sulochana Rani: నవలా రాజ్యంలో రాణి