Komaram Dhanalaxmi : సీతక్కకు షాక్ డీసీసీ చీఫ్ జంప్
ఎన్నికల వేళ ఎమ్మెల్యేకు దెబ్బ
Komaram Dhanalaxmi : ములుగు – తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి చెందిన దాసరి సీతక్క అలియాస్ సీతక్క ఒంటరి పోరాటం చేస్తోంది. ఆమెను ఎలాగైనా సరే ఓడించాలని అన్ని శక్తులు ఒక్కటయ్యాయి.
Komaram Dhanalaxmi Joined in BRS Party
ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ వస్తోంది ఎమ్మెల్యే సీతక్క. సీఎం కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో తాను ప్రశ్నించకుండా చూసేందుకే కుట్ర పన్నుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఎమ్మెల్యే.
ఇదిలా ఉండగా ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న కొమరం ధనలక్ష్మి(Komaram Dhanalaxmi) ఉన్నట్టుండి బిగ్ షాక్ ఇచ్చింది. తాను పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. గులాబీ కండువాను కప్పుకున్నారు.
తనను ఓడించడంలో భాగంగానే ధనలక్ష్మి జంప్ అయ్యిందంటూ ఆరోపించారు సీతక్క. మొత్తంగా ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ప్రస్తుతం ములుగు నియోజకవర్గంలో నువ్వా నేనా అన్నంతగా పోటీ నెలకొంది. మరో వైపు గతంలో సీతక్క నక్సలైట్ గా ఉన్నారు. కరోనా కష్ట కాలంలో తాను ప్రజలకు సేవలు అందించింది. దేశ వ్యాప్తంగా సెన్సేషన్ గా మారింది.
Also Read : CM Nitish Kumar : అశ్లీలతపై బీహార్ సీఎం కన్నెర్ర