Sambhani Chandrasekhar : బీఆర్ఎస్ లోకి సంభాని జంప్
కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి షాక్
Sambhani Chandrasekhar : ఖమ్మం – జిల్లాలో కోలుకోలేని షాక్ తగిలింది కాంగ్రెస్ పార్టీకి. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, మంత్రిగా పని చేసిన సంభాని చంద్రశేఖర్ గుడ్ బై చెప్పారు. తాను ఇక పార్టీలో ఉండలేనంటూ గులాబీ గూటికి చేరారు. బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.
Sambhani Chandrasekhar Joined in BRS Party
ఈ సందర్బంగా సంభాని చంద్రశేఖర్(Sambhani Chandrasekhar) మాట్లాడారు మీడియాతో. గత 50 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పని చేశానని , ఎక్కడా ఎవరికీ ఇబ్బంది లేకుండా ప్రజా జీవితంలో ఉన్నానని అన్నారు. ఇన్నేళ్లుగా నిస్వార్థంగా సేవలు అందించినా పార్టీ తనను పట్టించు కోలేదని ఆరోపించారు.
దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన తాను గత్యంతరం లేని పరిస్థితుల్లో గులాబీ గూటికి చేరాల్సి వచ్చిందని చెప్పారు. ఒక రకంగా బయటకు చెప్పలేక పోతున్నా వీడడం తన మనసు కలిచి వేస్తోందని చెప్పారు సంభాని చంద్రశేఖర్.
ఖమ్మం జిల్లాతో పాటు సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తానని స్పష్టం చేశారు . గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న పార్టీకి చాలా తేడా ఉందన్నారు. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్లకు టికెట్లు ఇస్తున్నారని, ఇలాంటి సంస్కృతి గతంలో లేదన్నారు.
Also Read : Chandrababu Case : బాబు బెయిల్ పిటిషన్ వాయిదా