Tirumala Rush : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.19 కోట్లు
దర్శనానికి 10 గంటల సమయం
Tirumala Rush : తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా భావించే తిరుమలకు భక్తుల రద్దీ యధావిధిగా కొనసాగూతనే ఉంది. రోజు రోజుకు భక్తుల తాకిడి పెరుగుతుండడంతో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చే భక్త బాంధవులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతి సౌకర్యాలను కల్పించే పనిలో పడింది. ఈ మేరకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కొలువు తీరాక తిరుమలలో కొన్ని మార్పులకు శ్రీకారం చుట్టారు. సామాన్య భక్తులకే పెద్ద పీట వేస్తామని స్పష్టం చేశారు.
Tirumala Rush with Devotees
ఇందులో భాగంగా టీటీడీ(TTD) ఈవో ఏవీ ధర్మా రెడ్డి పర్యవేక్షణలో శ్రీవారి సేవకులు, ఉద్యోగులు, సిబ్బంది భఖ్తుల సేవలో నిమగ్నమయ్యారు. ఎప్పటికప్పుడు వారికి సూచనలు అందిస్తూ ఇక్కట్లు అనేవి లేకుండా చేస్తున్నారు. కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్త బాంధవులకు జల, అన్న ప్రసాదం అందజేస్తున్నారు.
ఇదిలా ఉండగా శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 69 వేల 41 మంది భక్తులు దర్శించుకున్నారు. 22 వేల 415 మంది తలనీలాలు సమర్పించారు. భక్తులు నిత్యం సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.19 కోట్లు వచ్చిందని టీటీడీ వెల్లడించింది. 23 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
Also Read : ICC ODI WORLD CUP COMMENT : కప్ గెలిచేనా జెండా ఎగిరేనా