Eatala Rajender : కేసీఆర్ కామారెడ్డికి పారి పోయిండు
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్
Eatala Rajender : హుజూరాబాద్ – మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్ పై సంచలన కామెంట్స్ చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మామిండ్లవాడలో జరిగిన స్ట్రీట్ కార్నర్ లో ఈటల రాజేందర్ పాల్గొన్నారు.
Eatala Rajender Comments on KCR
దమ్ముంటే తనపై పోటీ చేయాలని తాను కేసీఆర్ కు సవాల్ విసిరానని అన్నారు. తాను గజ్వేల్ నియోజకవర్గంలో నిలబడతానని ప్రకటిస్తే భయపడి సీఎం కామారెడ్డికి పారి పోయిండంటూ ఎద్దేవా చేశారు ఈటెల రాజేందర్.
తాను గెలిచినా అసెంబ్లీకి రానీయడం లేదంటూ మండిపడ్డారు. అయినా ప్రజల మనస్సుల్లో నిలిచి ఉన్నానని, తన జీవిత కాలమంతా జనం కోసం పని చేస్తున్నానని స్పష్టం చేశారు. మాయ మాటలు చెబుతూ ప్రజలను మోసం చేసిన ఘనత బీఆర్ఎస్ కే దక్కుతుందన్నారు.
అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి చిలుక పలుకులు పలుకుతున్న కేసీఆర్ కు గజ్వేల్ లో తన చేతిలో పరాభవం తప్పదన్నారు ఈటల రాజేందర్(Eatala Rajender). ఆరు నూరైనా సరే తన గెలుపును అడ్డుకునే సత్తా ఎవరికీ లేదన్నారు. ప్రజల కోసం పని చేస్తున్న తనను అంతం చేయాలని కుట్ర పన్నినా ఆ కుట్రలు సాగలేదన్నారు.
Also Read : Telangana Election Commission : జానా రెడ్డి..జమునకు ఈసీ షాక్