Revanth Reddy : స్టేషన్ ఘణపూర్ – తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాలలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ను టార్గెట్ చేశారు. కల్వకుంట్ల కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయమని జోష్యం చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
Revanth Reddy Comments on KCR
రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఖాళీగా ఉన్నా ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేని సన్నాసి , దద్దమ్మ కేసీఆర్ అంటూ నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో వచ్చిన తెలంగాణలో కేవలం కల్వకుంట్ల ఫ్యామిలీనే లాభ పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
టీఎస్పీఎస్సీ ఇవాళ దొంగలకు , అక్రమాలకు పాల్పడిన వారితో నింపేశారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు. దశల వారీగా జాబ్స్ ను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి.
జాబ్స్ రావని ఆత్మహత్యలకు పాల్పడిన నిరుద్యోగుల కుటుంబాలను కేసీఆర్ ఏనాడైనా సందర్శించారా అని ప్రశ్నించారు.
Also Read : Eatala Rajender : కేసీఆర్ కామారెడ్డికి పారి పోయిండు