Malladi Venkata Krishna Murthy: ఆంధ్రుల ఆహ్లాద రచయిత
ఆంధ్రుల ఆహ్లాద రచయితగా మల్లాది వెంకట కృష్ణమూర్తి
మల్లాది వెంకట కృష్ణమూర్తి
Malladi Venkata Krishna Murthy : మల్లాది వెంకట కృష్ణమూర్తి: 1949 నవంబరు 13న విజయవాడలో జన్మించిన మల్లాది వెంకట కృష్ణమూర్తి అనేక నవలలు, కథలు, యాత్రా రచనలు చేశాడు. ఈయన రచనలు సహజత్వానికి దగ్గరగా ఉండి మలుపులతో ఉత్కంఠగా సాగుతాయి. అందుకే ఆంధ్రుల ఆహ్లాద రచయితగా మల్లాది వెంకట కృష్ణమూర్తి గుర్తింపు పొందారు. మల్లాది వెంకట కృష్ణమూర్తికి చెందిన అనేక రచనలు… సినిమాలుగా, సీరియల్స్ గా, వెబ్ సిరీస్ గా పలు భాషల్లో తెరక్కడమేకాకుండా విజయం సాధించాయి.
Malladi Venkata Krishna Murthy – మల్లాది ఉద్యోగ, రచనా ప్రస్థానం
ఆంధ్రాయూనివర్సిటీ నుండి కామర్స్ లో డిగ్రీ చేసిన మల్లాది వెంకట కృష్ణమూర్తి(Malladi Venkata Krishna Murthy) 1972 వరకు పలు ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తూ తరువాత ఆడిటర్ గా ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. 1986లో తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి స్థాయి రచయితగా మారారు. ఎందరో సంపాదకులు మల్లాది చిత్రాన్ని తమ పత్రికలలో ప్రచురిస్తామన్నప్పటికీ… రచయిత తాను అంగీకరించకపోవడంతో ఇంతవరకూ మల్లాది ఫోటో ఎక్కడా ప్రచురితం కాలేదు. మల్లాది వెంకట కృష్ణ మూర్తి 125 దాకా నవలలు, 3000 కు పైగా కథలు రాసారు. ట్రావలాగు యూరప్, ట్రావలాగు సింగపూర్, ట్రావలాగు అమెరికా, అమరికాలో మరోసారి అనే యాత్రా రచనలు కూడా మల్లాది చేసారు. మల్లాది రచనల్లో చంటబ్బాయ్, అందమైన జీవితం, శనివారం నాది, ధర్మయుద్ధం, మందాకిని, సముద్రపు దొంగలు, ష్ గుప్ చుప్, తేనెటీగ, లిటిల్ రాస్కెల్, సారీ రాంగ్ నెంబర్ ముఖ్యమైనవి.
హిట్ సినిమాలుగా మల్లాది నవలలు
ఆహ్లాద రచయితగా గుర్తింపు పొందిన మల్లాది రచించిన అనేక రచనలు… సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్ లుగా తెరకెక్కడమే కాకుండా విజయం సాధించాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన చంటబ్బాయ్, ఛార్మీ నటించిన జ్యోతిలక్ష్మి, తేనెటీగ, డబ్బెవరికి చేదు, లక్కీ ఛాన్స్, వెన్నెల్లో హాయ్ హాయ్ వంటి డజనకు పైగా తెలుగు సినిమాలతో పాటు హిందీ, కన్నడం, తుళు భాషల్లో కూడా ఆయన కధలు సినిమాల రూపంలో తెరకెక్కాయి. అంతేకాదు పోలీసు రిపోర్ట్, తేనెటీగ అనే చిత్రాలకి మాటలు రాసారు. మల్లాది నలవ ‘9 hours’ ఆధారంగా అదే పేరుతో ప్రముఖ దర్శకుడు క్రిష్ (జాగర్లమూడి రాధాకృష్ణ) నిర్మించిన వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
Also Read : Paravastu Chinnaya Suri: ప్రముఖ తెలుగు కవి