Hijab Ban : కన్నడ నాట హిజాబ్ నిషేధం
పరీక్షలకు అనుమతింం
Hijab Ban : కర్ణాటక – కన్నడ నాట కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ముస్లింలకు సంబంధించి హిజాబ్ సమస్య ప్రధానంగా మారింది. దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. ఈ తరుణంలో ఉన్నట్టుండి కీలక నిర్ణయం ప్రకటించింది. ఈ మేరకు హిజాబ్ ను నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేసింది.
Hijab Ban in Karnataka
కర్ణాటక(Karnataka) రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 18, 19వ తేదీలలో వివిధ బోర్డులు, కార్పొరేషన్లు నిర్వహించనున్న నేపథ్యంలో , రిక్రూట్ మెంట్ పరీక్షల సమయంలో తల, నోరు లేదా చెవులను కప్పి ఉంచే ఏదైనా వస్త్రం లేదా ముసుగు ధరించి వచ్చే వారిని ఎగ్జామ్ హాల్ లోకి అనుమతించే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం.
సీఎం సిద్దరామయ్య ఆదేశాల మేరకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. విద్యార్థుల, నిరుద్యోగులకు సంబంధించి పరీక్షలు అత్యంత కీలకమని, ఎవరు రాస్తున్నారనేది అత్యంత ముఖ్యమైన విషయమని పేర్కొన్నారు.
తాము తీసుకున్న ఈ అసాధారణ నిర్ణయం కొంత మందికి ఇబ్బంది కలిగించ వచ్చని కానీ సహకరించక తప్పదని స్పష్టం చేశారు సీఎం సిద్దరామయ్య.
Also Read : Ponguleti Srinivas Reddy : కాంట్రాక్టులు ఇస్తానన్నా వదులుకున్నా