Nadendla Manohar : కాల‌నీల నిర్మాణం జ‌గ‌న్ మోసం

నాదెండ్ల మ‌నోహ‌ర్ షాకింగ్ కామెంట్స్

Nadendla Manohar : గుంటూరు జిల్లా – ఏపీ రాష్ట్ర స‌ర్కార్ ఇళ్ల నిర్మాణంలో అవినీతికి పాల్ప‌డుతోంద‌ని ఆరోపించారు జ‌న‌సేన పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్. గురువారం మంగ‌ళ‌గిరి పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

Nadendla Manohar Comments on Jagan

జ‌గ‌న‌న్న కాల‌నీల నిర్మాణం పేరుతో పేద‌ల‌కు ఒరిగింది ఏమీ లేద‌న్నారు. ఈ కాల‌నీల‌కు ప్ర‌ధానంగా భూ సేక‌ర‌ణ పేరుతో అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని ఆరోపించారు. ఇందుకు సంబంధించి త‌మ వ‌ద్ద ఆధారాలు కూడా ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేశారు.

గ‌త ఏడాది న‌వంబ‌ర్ నెల‌లో త‌మ పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంద‌ర్శించి బ‌ట్ట బ‌య‌లు చేశార‌ని తెలిపారు మ‌నోహ‌ర్(Nadendla Manohar). ఈ కాల‌నీల ద్వారా ల‌బ్ది పొందింది జ‌గ‌న్ రెడ్డి, ఆయ‌న పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇత‌ర ప్రజా ప్ర‌తినిధులేన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఇప్ప‌టి వ‌ర‌కు భూ సేక‌ర‌ణ పేరుతో రూ. 35,141 కోట్ల అవినీతికి పాల్ప‌డ్డారంటూ ధ్వ‌జ‌మెత్తారు. సీఎం జ‌గ‌న్ రెడ్డి శాస‌న స‌భ‌లో చెప్పిన లెక్క‌ల‌కు , ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌ల‌కు పొంత‌న లేకుండా పోయింద‌న్నారు నాదెండ్ల మ‌నోహ‌ర్.

Also Read : CM KCR : మోసం కాంగ్రెస్ నైజం – కేసీఆర్

Leave A Reply

Your Email Id will not be published!