Chandra Babu Case : బాబు కేసులో విచారణ వాయిదా
ములాఖత్ కు సంబంధంచి దావా
Chandra Babu Case : అమరావతి – ఏపీ స్కిల్ స్కాం కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలుగుదేశం పార్టీ జాతీయ చీఫ్ నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ సీఐడీ ఎనిమిది కేసులు నమోదు చేసింది. ఇందులో ప్రధానంగా ఏపీ స్కిల్ స్కాం, ఫైబర్ నెట్ , అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్మెంట్ స్కాంతో పాటు మైనింగ్ స్కాం కూడా ఇటీవల చేర్చింది. భారీ ఎత్తున డబ్బులను హవాలా రూపంలో చేతులు మారాయంటూ ఆరోపించారు.
Chandra Babu Case Postponed
స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి రాజమండ్రి సెంట్రల్ జైలులో 53 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇదిలా ఉండగా తనకు అనారోగ్యం ఉందని బెయిల్ ఇవ్వాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. కాగా కేసులో భాగంగా ములాఖత్ విషయంలో అదనపు సౌకర్యాలను కల్పించాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు(Chandra Babu) నాయుడు తరపు న్యాయవాదులు.
గురువారం ములాఖత్ పిటషన్ పై విచారణ చేపట్టింది కోర్టు. ఈ మేరకు ఈ కేసు విచారణను డిసెంబర్ 4కు వాయిదా వేసింది కోర్టు. జైలులో ఉన్న సమయంలో లీగల్ ములాఖల్ లు పెంచాలని కోరుతూ పిటిషన్ లో పేర్కొన్నారు. మొత్తంగా చంద్రబాబు నాయుడి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది.
Also Read : Sajjala Ramakrishna Reddy : ఆరోపణలు సరే ఆధారాలు ఏవీ