Mohammed Ali : ధరణిలో గోల్ మాల్ జరగలేదు
హోం శాఖ మహమూద్ అలీ
Mohammed Ali : హైదరాబాద్ – తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్ అలీ(Mohammed Ali) షాకింగ్ కామెంట్స్ చేశారు. ధరణి తర్వాత గోల్ మాల్ అనేదే లేదన్నారు. గురువారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీఎంలు పోటీ పడుతున్నారని కానీ బీఆర్ఎస్ లో ఒకే ఒక్కరు సీఎంగా ఉంటారని పేర్కొన్నారు .
Mohammed Ali Comment Viral
ఎన్నికల వేళ చాలా మంది వస్తుంటారని, పోతూ ఉంటారని వారి గురించి తాము పట్టించు కోవాల్సిన పని లేదన్నారు. ఆరు నూరైనా తెలంగాణలో రాబోయే గులాబీ పార్టీనేనని ఇందులో ఎలాంటి అనుమానం లేదని పేర్కొన్నారు మహమూద్ అలీ.
దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాలు , కార్యక్రమాలు చేస్తున్నామని ఈ ఘనత ఒకే ఒక్కడు కేసీఆర్ కు మాత్రమే దక్కుతుందని, కావాలని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు పట్టించుకునే తీరిక తమకు లేదని స్పష్టం చేశారు హోం శాఖ మంత్రి.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని అన్నారు. ఆయన పదే పదే చెబుతున్న ధరణి పోర్టల్ లో ఎలాంటి తప్పులు , అవక తవకలు జరగలేదని చెప్పారు మహమూద్ అలీ.
Also Read : Chandra Babu Case : బాబు కేసులో విచారణ వాయిదా