MLC Kavitha : గులాబీ జెండా గెలుపు పక్కా
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
MLC Kavitha : కోరుట్ల – తెలంగాణ రాష్ట్రంలో మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని జోష్యం చెప్పారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఎన్నికల ప్రచారంలో భాగంగా కోరుట్లలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. 119 నియోజవర్గాలలో కనీసం 100 నియోజకవర్గాలలో తాము గెలుపొందడం పక్కా అని పేర్కొన్నారు.
MLC Kavitha Comment
దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్ని రకాలుగా అభివృద్ది చెందిందని స్పష్టం చేశారు కల్వకుంట్ల కవిత(MLC Kavitha). 2 లక్షలకు పైగా జాబ్స్ భర్తీ చేయడం జరిగిందన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అబద్దమన్నారు. అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలకు గురవుతున్నరాని తెలిపారు.
డిసెంబర్ 3న ఫలితాలు వస్తాయని ఆరోజు తాము మళ్లీ ప్రగతి భవన్ లోనే ఉంటామన్నారు . డిసెంబర్ 9న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తుందన్నారు. తన తండ్రి, ఉద్యమ నాయకుడు , బీఆర్ఎస్ బాస్ , సీఎం గా ఉన్న కేసీఆర్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని జోష్యం చెప్పారు.
ఇవాళ విద్యా, ఆరోగ్య పరంగా సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. తాము ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు తమను గట్టెక్కిస్తాయని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.
Also Read : CM KCR : తెలంగాణ అభివృద్దికి చిరునామా