Uday Babu Mohan : బాబు మోహన్ కు షాక్ కొడుకు జంప్
బీజేపీకి గుడ్ బై బీఆర్ఎస్ కు జై
Uday Babu Mohan : ఆందోల్ – బీజేపీ సీనియర్ లీడర్, ఆందోల్ ఆ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి ప్రముఖ నటుడు బాబు మోహన్(Babu Mohan) కు బిగ్ షాక్ తగిలింది. తనయుడు ఉదయ్ బాబు మోహన్ జంప్ అయ్యారు. తాను తండ్రిని కాదని గులాబీ గూటికి చేరారు. ఇది ఊహించని షాక్.
Uday Babu Mohan Viral
ఆదివారం సిద్దిపేటలో ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఉదయ్ బాబు మోహన్ కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇది ఊహించని పరిణామం. తనకు తొలి జాబితాలో టికెట్ రాక పోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బాబు మోహన్. రెండో జాబితాలో ఖరారు చేసింది.
ఇదిలా ఉండగా ఉదయ్ బాబు మోహన్ తో పాటు ఆందోల్, జోగిపేట మున్సిపల్ ప్రెసిడెంట్ సాయికృష్ణ, ఆందోల్ మండల అధ్యక్షుడు నవీన్ , చౌటకూర మండల అధ్యక్షుడు శేఖర్, ఇతర బీజేపీ నాయకులు బీఆర్ఎస్ లో చేరారు.
ఎన్నికల వేళ ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి నేతలు చేరేందుకు క్యూ కట్టారు. మొత్తంగా మాజీ మంత్రిగా , కీలకమైన నేతగా ఉన్న బాబు మోహన్ కు ఇది మింగుడు పడని విషయం. ఏది ఏమైనా తన కొడుకునే కంట్రోల్ పెట్టకోలేని తండ్రి ఎలా ఆందోల్ లో గెలుస్తాడనేది మిలియన్ డాలర్ ప్రశ్న.
Also Read : BJP Manifesto : నిరాశ పర్చిన బీజేపీ మేనిఫెస్టో