Priyanka Gandhi : ఇందిర జీవితం స్పూర్తి దాయ‌కం

ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ

Priyanka Gandhi : ఖానాపూర్ – దివంగ‌త ప్ర‌ధాని ఇందిరా గాంధీ జీవితం స్పూర్తి దాయ‌క‌మ‌ని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ. తెలంగాణ‌లో ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆదివారం ఆసిఫాబాద్, ఖానాపూర్ ల‌లో జ‌రిగిన స‌భ‌లలో ప్ర‌సంగించారు.

Priyanka Gandhi Comment

త‌న జీవిత కాల‌మంతా ప్ర‌జ‌ల కోసం, దేశం కోసం ప‌ని చేశార‌ని అన్నారు. ఆమె ప్ర‌వేశ పెట్టిన సంస్క‌ర‌ణ‌లు, తీసుకు వ‌చ్చిన ప‌థ‌కాలు ఈనాటికీ పేద‌లు గుర్తు పెట్టుకుంటార‌ని స్ప‌ష్టం చేశారు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi ). ఇవాళ ఆమె జ‌యంతి కావ‌డంతో ఘ‌నంగా నివాళులు అర్పించారు. ఇందిరా గాంధీ చ‌ని పోయి 40 ఏళ్లు అయినా ఇంకా జ‌నం ఆద‌రిస్తున్నార‌ని, గుర్తు చేసుకుంటున్నార‌ని చెప్పారు.

నిజాయితీతో, నిబ‌ద్ద‌త‌తో ప‌ని చేసిన ఘ‌న‌మైన చ‌రిత్ర ఇందిరా గాంధీద‌ని అన్నారు. ప్ర‌జ‌ల కోసం ప‌ని చేసిన ఆమెను కొంద‌రు పొట్ట‌న పెట్టుకున్నార‌ని ఆవేద‌న చెందారు. ఇదే స‌మ‌యంలో త‌మ తండ్రిని కూడా అన‌వ‌స‌రంగా చంపేశారంటూ వాపోయారు ప్రియాంక గాంధీ.

ఏది ఏమైనా పేద‌లు, మ‌ధ్య త‌ర‌గతి ప్ర‌జ‌ల‌కు ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉండేలా సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేసిన ఘ‌న‌త త‌మ‌కే ద‌క్కుతుంద‌న్నారు. ఈసారి జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు .

Also Read : Revanth Reddy : రాజ‌కీయ క‌క్ష సాధింపులు ఉండ‌వు

Leave A Reply

Your Email Id will not be published!