Local Boy Nani Arrest : యూట్యూబ‌ర్ నాని అరెస్ట్

విశాఖ ఘ‌ట‌న‌లో కీల‌క మార్పు

Local Boy Nani Arrest : విశాఖ‌ప‌ట్ట‌ణం – విశాఖ‌లోని ఫిషింగ్ హార్బ‌ర్ లో చోటు చేసుకున్న అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. 100కి పైగా బోట్లు కాలి పోయాయి. మ‌త్స్య‌కారులు రోడ్డున ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. అయితే ఈ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. లోకల్ బాయ్ నాని గా పేరు పొందిన యూట్య‌బ‌ర్. త‌ను నిన్న భార్య శ్రీ‌మంతం కావ‌డంతో త‌న మిత్రులు పార్టీ అడిగారు. దీంతో బోటులో మందు పార్టీ ఇచ్చిన‌ట్టు టాక్.

Local Boy Nani Arrest for Boats Firing Issue

ఇదే విష‌యంపై పోలీసుల‌కు ప్రాథ‌మిక స‌మాచారం అందిన‌ట్లు టాక్. బాలాజీ అనే వ్య‌క్తితో గొడ‌వ జ‌ర‌గ‌డంతోనే ప్ర‌మాదం జ‌రిగింది. ఈ విష‌యాన్ని ప్ర‌త్య‌క్ష సాక్షులు పోలీసులకు తెలిపారు. దీంతో విచారించేందుకు నానితో పాటు అత‌డి మిత్రుల‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండ‌గా మ‌త్స్య‌కారుల‌కు న్యాయం చేయాల‌ని కోరారు జ‌న‌సేన పార్టీ నేత‌లు.

ఈ మొత్తం వ్య‌వ‌హారంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఘ‌ట‌న లో బోట్లు కోల్పోయిన మ‌త్స్యకారుల‌కు భ‌రోసా ఇచ్చారు. ఈమేర‌కు ఆదుకుంటామ‌ని హామీ ఇచ్చారు. మంత్రి సిదిరి అప్ప‌ల‌రాజు(Seediri Appalaraju) ఘ‌ట‌నా స్థ‌లానికి వెళ్లారు. బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు. ఆరు నూరైనా స‌రే ఆదుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. ఇదే స‌మ‌యంలో ఎవ‌రూ బాధ ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

Also Read : NCW Case : మ‌న్సూర్ పై మహిళా క‌మిష‌న్ ఫైర్

Leave A Reply

Your Email Id will not be published!