YS Sharmila Slams : కేసీఆర్ ఖేల్ ఖతం
బీఆర్ఎస్ దుకాణం బంద్
YS Sharmila Slams : హైదరాబాద్ – వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమన్నారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వైఎస్సార్ టీపీ బేషరతు మద్దతు తెలిపింది.
YS Sharmila Slams KCR
ఈ సందర్బంగా మంగళవారం ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసింది వైఎస్ షర్మిల(YS Sharmila). మరో మూడు వారాల్లో నియంత పాలనకు పుల్ స్టాప్ పడనుందని జోష్యం చెప్పారు. ఆ అపురూప దృశ్యం ఆవిష్కృతం అయ్యే రోజు తప్పకుండా వస్తుందన్నారు.
అవినీతి, అక్రమాలు, అహంకారం , దొరల గడీల పాలనలో చిక్కుకు పోయిన తెలంగాణకు విముక్తి లభిస్తుందన్నారు. ఈ తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో ప్రజలు నానా రకాలుగా ఇబ్బందులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ షర్మిల.
నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో పవర్ లోకి వచ్చిన కేసీఆర్ సర్కార్ కు రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. ప్రజలు ఇకనైనా మేలుకోవాలని తమ విలువైన ఓటును కాంగ్రెస్ పార్టీకి వేయాలని పిలుపునిచ్చారు. ఎవరు దొంగలో ఎవరు నిజాయితీ పరులో తెలుసు కోవాలని, ప్రజలకు సేవలు అందించే వారికే పట్టం కట్టాలని సూచించారు .
Also Read : Harish Rao : ఆరు నూరైనా రుణ మాఫీ చేస్తాం