Kodandaram : ఓటమి భయం పరాజయం ఖాయం
కోదండరాం షాకింగ్ కామెంట్స్
Kodandaram: హైదరాబాద్ – తెలంగాణ జన సమితి పార్టీ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుత జరగబోయే ఎన్నికల్లో తాను ఓడి పోతామోనన్న భయం పట్టుకుందంటూ సెటైర్ వేశారు. రోజు రోజుకు ఆశలు సన్నగిల్లాయని, అందుకే సహనం కోల్పోయి మాట్లాడుతున్నాడంటూ మండిపడ్డారు. ప్రజల పట్ల ఎలాంటి ప్రేమ లేని సదరు సీఎంను పక్కన పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
Kodandaram Serious Comments on KCR
మంగళవారం కోదండరాం ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. తట్టుకోలేక పరాజయం కలుగుతుందనే భయంతోనే కాంగ్రెస్ పార్టీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ పేర్కొన్నారు కోదండరాం(Kodandaram). రాష్ట్రానికి కేసీఆర్ ఓ భస్మాసురుడి లాగా తయారయ్యాడని సంచలన కామెంట్స్ చేశారు.
ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఎలాగైనా సరే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని నిర్ణయించు కున్నారని స్పష్టం చేశారు. ఇవాళ నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఏర్పాటైన తెలంగాణ ప్రజలకు దూరంగా మారిందన్నారు. అది కేవలం దొరల తెలంగాణగా మార్చేసిన ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు.
రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఖాళీలు ఉంటే ఇప్పటి దాకా ఒక్క పోస్టు ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించారు కోదండరాం. దొర సీఎం పదవి నుంచి దిగే సమయం ఆసన్నమైందన్నారు.
Also Read : YS Sharmila Slams : కేసీఆర్ ఖేల్ ఖతం