Minister KTR : కాంగ్రెస్ ఓటేస్తే 50 ఏళ్లు వెనక్కి
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కామెంట్
Minister KTR : దుబ్బాక – పొరపాటున కాంగ్రెస్ పార్టీకి గనుక ఓటు వేస్తే తెలంగాణ మరోసారి సర్వ నాశనం అవుతుందని హెచ్చరించారు ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR). ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం దుబ్బాకలో అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి తరపున ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
Minister KTR Serious Comments on Congress
స్థానిక నాయకత్వం కావాలా లేక ఢిల్లీలో ఉన్న నేతలకు గులాం గిరీ చేసే నేతలు కావాలో మీరే తేల్చు కోవాలని అన్నారు. ఓటు అనేది విలువైనదని దయచేసి ముందు వెనుకా ఆలోచించి వేయాలని కోరారు. అభివృద్ది కావాలంటే బీఆర్ఎస్ కు ఓటు వేయాలని లేదంటే 50 ఏళ్లు వెనక్కి వెళ్లాలంటే కాంగ్రెస్ ను ఎంచు కోవాలని సూచించారు కేటీఆర్.
ఎన్నికల్లో ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక తమ అభ్యర్థిపై దాడి చేశారంటూ వాపోయారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు కేవలం రౌడీ నేపథ్యం కలిగిన కాంగ్రెస్ పార్టీ వాళ్లకే చెల్లుతుందన్నారు. కానీ తాము వీటిని ప్రోత్సహించే ప్రసక్తి లేదన్నారు.
కాంగ్రెస్ పార్టీకి 11 సార్లు అధికారం ఇచ్చారని కానీ తెలంగాణను బొంద పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : CM KCR : కాంగ్రెస్ కు 20 సీట్లు రావు