Telangana CEO Vikas Raj : ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై సీఈవో కామెంట్
Telangana CEO Vikas Raj : హైదరాబాద్ – తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సంచలన నిర్ణయం తీసుకుంది .రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వికాస్ రాజ్(Telangana CEO Vikas Raj) మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రభుత్వ రంగానికి చెందిన ఉద్యోగులు, సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకున్నారు.
Telangana CEO Vikas Raj Good News
నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. దాదాపు 4 లక్షల మందికి పైగా విధులు నిర్వహిస్తున్న వారికి పోస్టల్ బ్యాలెట్ పేపర్లు ఇంకా అందలేదు. చాలా చోట్ల తమకు అందలేదంటూ పెద్ద ఎత్తున ఉద్యోగులు ఆందోళనకు దిగారు.
ఇది దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా ఎన్నికల సంఘం రాష్ట్ర సర్కార్ కు వంత పాడేలా ప్రయత్నం చేస్తోందంటూ ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో తనపై పెద్ద ఎత్తున విమర్శలు చోటు చేసుకోవడంతో రంగంలోకి దిగారు సీఈవో.
ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అందని వారు వెంటనే ఓటు హక్కు ఉన్న నియోజవర్గానికి సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసర్ ను సంప్రదించాలని సూచించారు. ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్ చూపించి పోస్టల్ బ్యాలెట్ తీసుకోవచ్చని స్పష్టం చేశారు. ఫెసిలిటేషన్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించు కోవచ్చని ఆదేశాలు జారీ చేశారు.
Also Read : Minister KTR : మాకే అధికారం మాదే రాజ్యం