Telangana Elections 2023 : తెలంగాణలో పోటెత్తిన ఓటర్లు
ప్రారంభమైన పోలింగ్ ..భారీ భద్రత
Telangana Elections 2023 : తెలంగాణ – రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న పోలింగ్ గురువారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది. పెద్ద ఎత్తున భద్రతా బలగాలు, కెమెరాల నీడన మధ్య జనం ఓటు వేసేందుకు పోటెత్తారు. పోలింగ్ కొనసాగుతుండగా తమ ఓటు వినియోగించు కునేందుకు ఓటర్లు బారులు తీరారు. స్వేచ్ఛగా ఓటు వేయాలని, ప్రలోభాలకు లొంగ వద్దని ఇప్పటికే ఎన్నికల సంఘం విన్నవించింది.
Telangana Elections 2023 Started
నిన్న సాయంత్రం నుంచి ఇవాళ్టి ఉదయం దాకా ఆయా పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసినట్లు ఆరోపణలున్నాయి. చాలా చోట్ల ఓటుకు రూ. 500 నుంచి రూ. 20,000 దాకా ఇచ్చినట్లు విమర్శలు వచ్చాయి. హుజూరాబాద్ లో గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఓటుకు రూ. 6,000 పంచారని కానీ ఇప్పుడు రూ. 500 ఇవ్వడంపై జనం తీవ్ర స్థాయిలో మండి పడడం విస్తు పోయేలా చేసింది.
ఇక పోలింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా చేసి ఈసీ. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు చేపట్టారు. ఇదిలా ఉండగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని డీజీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపడుతున్నామని చెప్పారు.
సినీ రంగానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ , ఆయన సతీమణితో పాటు అల్లు అర్జున్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరంతా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఇక ఇదే నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ(Congress) తరపున బరిలో ఉన్న భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ తన కుటుంబంతో కలిసి ఓటు వేశారు.
Also Read : Congress Complaint : కేటీఆర్ పై ఈసీకి ఫిర్యాదు