MP Arvind : హైదరాబాద్ – భారతీయ జనతా పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్(MP Arvind) సంచలన కామెంట్స్ చేశారు. ఈ సందర్బంగా స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అభినందనీయమన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
MP Arvind Wishes
టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బలపడిందన్నారు. చిన్న స్థాయి నుంచి సీఎం పదవికి పోటీ పడే స్థాయికి ఎదిగాడని ప్రశంసలు కురిపించారు. బీజేపీకి కేవలం 8 సీట్లు మాత్రమే రావడం ఒకింత సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఈసారి ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ప్రచారం చేయడంలో ఆ పార్టీ సక్సెస్ అయ్యిందన్నారు. అందుకే తమకు డ్యామేజ్ జరిగిందన్నారు. తాను ఓడి పోయినందుకు బాధ పడడం లేదన్నారు. ప్రజలు తనను ఆదరించారని , ఓటు వేసిన వారికి వేయని వారికి ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని తెలిపారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఖతమైందన్నారు. నిన్నటి దాకా అహంకారంతో విర్ర వీగిన కేసీఆర్ పతనం మొదలవుతుందన్నారు. భవిష్యత్తులో తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మాత్రమే మిగిలి పోతుందన్నారు. ఇదే సమయంలో రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ తెలియ చేస్తున్నట్లు చెప్పారు అరవింద్.
Also Read : T Prabhakar Rao : ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు రిజైన్