Yadadri Temple : యాదగిరిగుట్ట కళ కళ
పోటెత్తుతున్న భక్తులు
Yadadri Temple : యాదగిరిగుట్ట – ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆధునిక వసతులతో రూపు దిద్దుకున్న లక్ష్మీ నరసింహ్మ స్వామి కొలువు తీరిన యాదగిరిగుట్టకు భక్తులు పోటెత్తారు. రోజు రోజుకు భక్తుల రాకతో సందడి వాతావరణం నెలకొంది. కోరిన కోర్కెలు తీర్చే పుణ్య క్షేత్రంగా వినుతికెక్కింది యాదాద్రి.
Yadadri Temple Viral
భారీ ఎత్తున కోట్లాది రూపాయలు కేటాయించింది గతంలోని బీఆర్ఎస్ సర్కార్. అంతే కాకుండా ఆనాటి మాజీ సీఎం కేసీఆర్ , కొందరు ప్రజా ప్రతినిధులు కానుకలు, విరాళాలు సమర్పించారు. ఇదే సమయంలో ప్రముఖ ఆర్కిటెక్షర్ ఆనంద్ సాయి సారథ్యంలో దీనిని తయారు చేశారు.
సుదూర ప్రాంతాల నుండి అష్ట కష్టాలు పడి యాదగిరిగుట్టకు(Yadadri Temple) వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టింది యాదాద్రి పాలక మండలి. ఈ మేరకు ఈవో ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.
మరో వైపు యాదిద్రిలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువుగా పేరు పొందిన శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామీకి అతి తక్కువ ధరకే యాదాద్రి ఆలయ ప్రాంగణ పరిధిలో స్థలం కేటాయించింది. దీనిపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున అభ్యంతరం తెలిపారు. ఆనాటి సీఎం కేసీఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Akunuri Murali : ఆకునూరి కామెంట్స్ కలకలం