Telangana Cabinet : గవర్నర్ ప్రసంగానికి ఆమోదం
తెలంగాణ కాంగ్రెస్ మంత్రివర్గం
Telangana Cabinet : హైదరాబాద్ – సత్ సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం మంత్రివర్గం భేటీ అయ్యింది. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్బంగా నూతన స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నికయ్యారు. అనంతరం సభను శుక్రవారం నాటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు స్పీకర్.
Telangana Cabinet Updates
తాజాగా రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ అయ్యింది సచివాలయంలో. ఈ సందర్బంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలియ చేయాలని తీర్మానం చేశారు. ఈ మేరకు ఆమోదం లభించింది కేబినెట్ నుంచి.
కేసీఆర్ హయాంలో గవర్నర్ ను పిలిచే సంప్రదాయానికి చెక్ పెట్టారు. అంతా తానై వ్యవహరించారు. ఒకానొక దశలో తమిళి సైని అనరాని మాటలు అన్నారు. ఈ మేరకు కేబినెట్ తీర్మానంతో తమిళి సై సౌందర రాజన్(Tamilisai Soundararajan) శాసన సభలో ప్రసంగించనున్నారు.
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. పవర్ లోకి వచ్చిన వెంటనే ఇందులో 2 గ్యారెంటీలను అమలు చేసింది. ఇందుకు సంబంధించి నిధులను కూడా విడుదల చేసింది. ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
Also Read : CM Revanth Reddy : గడ్డం ప్రజా నాయకుడు – సీఎం