TTD Srivaani Tickets : ఎన్నారైలకు శ్రీవాణి టికెట్లు
ప్రతి రోజూ 100 ఆఫ్ లైన్ టికెట్లు జారీ
TTD Srivaani Tickets : తిరుమల – భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించుకునేలా చర్యలు చేపట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ). ఇందులో భాగంగా రూ. 10,000 తో శ్రీవాణి టికెట్లను జారీ చేస్తూ వస్తోంది. శ్రీవాణి ట్రస్టుకు పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది.
TTD Srivaani Tickets for NRI’s
ఇప్పటి వరకు టీటీడీ ఆన్ లైన్ లో భక్తుల సౌకర్యార్థం శ్రీవాణి టికెట్లను జారీ చేస్తూ వచ్చింది. దీంతో భక్తులకు మరింత చేరువ అయ్యేలా శ్రీవాణి టికెట్లను ఆన్ లైన్ లో కాకుండా ఆఫ్ లైన్ లో టికెట్లను జారీ చేయాలని నిర్ణయించింది పాలక మండలి.
ఇందులో భాగంగా డిసెంబర్ 16 నుండి తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో టికెట్లను జారీ చేయనున్నట్లు వెల్లడించింది టీటీడీ(TTD). దేశ విదేశాల నుండి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే విమాన ప్రయాణీకులకు ప్రతి రోజూ ఆఫ్ లైన్ లో 100 శ్రీవాణి టికెట్లను ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది.
కాగా తిరుపతి ఎయిర్ పోర్టులో శ్రీవాణి టికెట్ల జారీకి పర్మిషన్ లేని కారణంగా గోకుల విశ్రాంతి భవనంలో జారీ చేయనున్నట్లు తెలిపింది టీటీడీ. విదేశాల నుంచి తిరుమలకు వచ్చే ఎన్నారైలు మార్చిన విషయాన్ని గమనించాలని కోరింది.
Also Read : CM Revanth Reddy : నళినికి ఉద్యోగం ఇస్తే తప్పేంటి