Revanth Reddy : తెలంగాణను సర్వ నాశనం చేశారు
మాజీ సీఎం కేసీఆర్ పై రేవంత్ ఫైర్
Revanth Reddy : హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. శనివారం అసెంబ్లీలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పేరుతో విధ్వంసం సృష్టించారని, సర్వ నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. బీఆర్ఎస్ కేవలం కుటుంబ పాలనకే పరిమితమైందని ఆరోపించారు రేవంత్ రెడ్డి.
Revanth Reddy Shocking Comments
ప్రజలు కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని, కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ప్రజా తీర్పును స్వీకరించేందుకు బీఆర్ఎస్ నేతలు ఒప్పుకోక పోవడం దారుణమన్నారు. ప్రతిపక్షాలు అవగాహనతో రావాలని సూచించారు.
ఎమ్మెల్యే పదవి అనేది తాత్కాలిక ఉద్యోగం కాదన్నారు. మనం పాలకులం కాదు సేవకులమని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy). ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వైఖరి మార్చుకోక పోతే ప్రజలు బయటకు పంపడం ఖాయమని జోష్యం చెప్పారు.
ప్రగతి భవన్ లోకి సహచర మంత్రి ఈటల రాజేందర్ ను అనుమితించని చరిత్ర ఆనాటి పాలకులదన్నారు. ప్రగతి భవన్ ను ఇనుప కంచెలను బద్దలు కొట్టడం జరిగిందన్నారు. ప్రజలకు ప్రవేశం కల్పించడం చేశామన్నారు సీఎం. ఉద్యమం పేరుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ రాష్ట్రానికి చేసిన న్యాయం ఏమీ లేదని వాపోయారు.
Also Read : Vijay Sai Reddy : బాలినేనితో విజయ సాయి భేటీ