Ambati Ram Babu : చంద్రబాబుకు మతి చెడింది
ఏపీ మంత్రి అంబటి రాంబాబు
Ambati Ram Babu : అమరావతి – తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై సంచలన ఆరోపణలు చేశారు ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
Ambati Ram Babu Comments on Chandrababu
చంద్రబాబు నాయుడు తను ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియడం లేదంటూ ఎద్దేవా చేశారు. ఆయనకు మతి చెడిందన్నారు అంబటి రాంబాబు(Ambati Ram Babu). మతి స్థిమితం లేకుండా మాట్లాడటం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
వైసీపీ అభ్యర్థుల మార్పుపై తల తిక్కగా మాట్లాడుతున్నారంటూ ఆరోపించారు . ఎందుకు చంద్రబాబు నాయుడు ఒక చోటు పోటీ చేయలేక పోతున్నారంటూ నిలదీశారు అంబటి రాంబాబు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లు రాబోయే ఎన్నికల్లో ఒక చోటు నుంచి పోటీ చేయగలరా అని ప్రశ్నించారు.
టీడీపీ, జనసేన పార్టీలను నామ రూపాలు లేకుండా చేస్తామని హెచ్చరించారు. కాల గర్భంలో కలిపి వేస్తామంటూ పేర్కొన్నారు. తమ వ్యూహాలను తట్టుకోవడం కష్టమన్నారు అంబటి రాంబాబు. 2024లో ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని జోష్యం చెప్పారు.
Also Read : Revanth Reddy : తెలంగాణను సర్వ నాశనం చేశారు