Pawan Kalyan : కాకినాడపై పవన్ కళ్యాణ్ ఫోకస్
మూడు రోజుల పాటు అక్కడే మకాం
Pawan Kalyan : అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సందడి నెలకొంది. ప్రస్తుతం కొలువు తీరిన వైసీపీ సర్కార్ కు వ్యతిరేకంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు పూర్తి స్థాయిలో ధ్వజమెత్తడం స్టార్ట్ చేశారు. శాసన సభ ఎన్నికల్లో ఈసారి కనీసం 100 సీట్లకు పైగా గెలవాలని వ్యూహాలు పన్నుతున్నారు. ఈసారి టీడీపీ, జనసేన కలిసి పోటీకి దిగాలని నిర్ణయించారు. ఇదే నిర్ణయాన్ని ప్రకటించారు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్.
Pawan Kalyan Focus
జనసేన పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలనే దానిపై ప్రత్యేకంగా చర్చించారు ఇద్దరు నేతలు. ప్రస్తుతం ఏపీపై ఫుల్ ఫోకస్ పెట్టారు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan). ఇందులో భాగంగా ఈనెల 28న కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నారు.
ఆయన మూడు రోజుల పాటు అక్కడే ఉంటారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఇక్కడ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాలలో పార్టీ పరిస్థితిపై సమీక్ష చేపట్టనున్నారు నేతలు, కార్యకర్తలతో పవన్ కళ్యాణ్. కాగా పవన్ కళ్యాణ్ టూర్ కు సంబంధించి ఇంకా అధికారికంగా పార్టీ ప్రకటించ లేదు. ఏది ఏమైనా రాష్ట్రంలో పొలలిటికల్ వేడి మరింత పెరిగింది.
Also Read : Nara Lokesh : ఆర్జీవీ వ్యూహంపై లోకేష్ పిటిషన్